Friday, October 23, 2026
Home Sports మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తన నివాసానికి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి….

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తన నివాసానికి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి….

0
22

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18

జాతీయ స్థాయి మోడల్ రాకెట్రీ పోటీల ఫైనల్స్‌కు ‘రాకెట్ రుద్రమ-2’ ఎంపిక: విద్యార్థుల ప్రతిభకు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 2 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు.హనుమకొండ నగరంలో నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026, ఎడిషన్ 02’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా హనుమకొండలోని రామకృష్ణ కాలనీలో గల తన నివాసానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ..గతంలో కుడా చైర్మన్‌గా ఉన్న హయాంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ‘రాకెట్ రుద్రమ-1’ లాంచ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే స్ఫూర్తితో ఇప్పుడు మళ్ళీ వరంగల్ ఎన్ఐటీ విద్యార్థి పింగిళి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం రూపొందించిన ‘రాకెట్ రుద్రమ-2’ మరో అరుదైన ఘనత సాధించింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), IN-SPACe సంయుక్తంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “IN-SPACe మోడల్ రాకెట్రీ ఇండియా స్టూడెంట్ కాంపిటీషన్” పోటీలలో ‘రాకెట్ రుద్రమ-2’ అత్యంత కీలకమైన క్రిటికల్ డిజైన్ రివ్యూ (CDR) క్వాలిఫికేషన్ సాధించి, జాతీయ స్థాయి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.ఈ రాకెట్ తుది తయారీ మరియు ప్రయోగ ఖర్చుల కొరకు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డల్లాస్‌ కంపనీ -E4Z TECHNOLOGIES అధినేత శరత్ రెడ్డి సౌజన్యంతో రూ. 2,00,000 ( రెండు లక్ష రూపాయలు) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు దానికి సంబంధించిన చెక్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గ చేతుల మీదుగా ఎన్ఐటీ వరంగల్ విద్యార్థి పింగిళి రాజశేఖర్ రెడ్డి వారి బృందానికి ఘనంగా అందజేశారు.సాంకేతిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, దేశ భవిష్యత్తు అయిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ని మరియు అంతరిక్ష రంగంలో రాణిస్తున్న ఎన్ఐటీ విద్యార్థుల బృందాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీల్లో ‘రాకెట్ రుద్రమ-2’ విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.