–వరంగల్. పరివార్తన అవాజ్ తెలుగు దిన పత్రిక ,సెప్టెంబర్ 29….
హనుమకొండ: తెలంగాణలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతోందని ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ,మాజీ హెల్త్ డైరెక్టర్,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ అన్నారు.హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ హాల్‌లో జనసేన ముఖ్య నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గడల శ్రీనివాస్ మాట్లాడుతూ…. సామాజిక న్యాయమే జనసేన లక్ష్యమన్నారు.పట్టభద్రులు,నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.విద్య,ఉపాధి,ఉద్యోగ నియామకాలు,యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను శాసనమండలి వేదికగా బలంగా ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు,హక్కులు అందేలా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని అన్నారు.జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని,ఓటరు నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు.మచ్చ సుధాకర్,శ్రీధర శర్మ మాట్లాడుతూ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మాదిరెడ్డి దామోదర్‌రెడ్డి,జిల్లా నేతలు గాదె పృథ్వీ,గోళ్ల రాజేంద్రప్రసాద్,గడ్డం రాకేష్,డా.పద్మజాదేవి,కరాటే ప్రభాకర్,మెరుగు శివకోటి,అమంచ సునీల్,నామాల సిద్ధులు,రాజ్‌కుమార్,ప్రశాంత్‌రెడ్డి,బర్ల శివ,ముస్కు రమేష్,ప్రశాంత్,సనత్,ప్రసన్నకుమార్,చక్రపాణి,రవిష్,నగేష్,ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు,నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు పాల్గొన్నారు.




