-తెలంగాణలో జనసేన ప్రత్యామ్నాయం… -పట్టభద్రులు,నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గళం వినిపిస్తాం గడల శ్రీనివాస్….

-వరంగల్. పరివార్తన అవాజ్ తెలుగు దిన పత్రిక ,సెప్టెంబర్ 29.... హనుమకొండ: తెలంగాణలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతోందని ఆ పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ,మాజీ హెల్త్‌ డైరెక్టర్‌,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్‌ అన్నారు.హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌ హాల్‌లో జనసేన ముఖ్య నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గడల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.... సామాజిక న్యాయమే జనసేన లక్ష్యమన్నారు.పట్టభద్రులు,నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.విద్య,ఉపాధి,ఉద్యోగ నియామకాలు,యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను...