Friday, October 23, 2026
Home Politics -సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ…. -పేద ప్రజల...

-సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ…. -పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి..

0
34

📰 Generate e-Paper Clip

 

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 29

 మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ  వరంగల్ ఓసిటిలో గల క్యాంపు కార్యాలయంలో 61 లక్షల 61వేల రెండు వంద రూపాయల విలువ గల మొత్తం111 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు. తూర్పు ఎమ్మెల్యే  కొండా సురేఖ  మాట్లాడుతూ పేద వర్గాల ప్రజలు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకుకోవడానికి అయ్యే వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి సురేఖ  తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పేద ప్రజల సంక్షేమాన్ని ఆపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.