Tuesday, September 22, 2026
Home People వర్ధన్నపేట PACS చైర్మన్‌, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* *సహకార...

వర్ధన్నపేట PACS చైర్మన్‌, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు* *సహకార రంగాన్ని బలోపేతం చేసి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…

0
8

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22

వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా నియమితులైన అబ్బిడి రాజిరెడ్డితో పాటు నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు మంగళవారం సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  అబ్బిడి రాజిరెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, నియామక పత్రాలను అందజేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన చైర్మన్ , కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. PACSలు రైతులకు అందుబాటులో ఉండేలా పనిచేయడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రైతుల అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహకార సేవలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని అన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
సహకార సంఘాల ద్వారా రైతులకు అందే సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు, సంఘం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ PACSకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి అబ్బిడి రాజిరెడ్డి మరియు నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ వర్ధన్నపేట PACS అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో PACS నూతన కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.