Tuesday, September 22, 2026
Home Politics -పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడి పని చేసేవారినే ప్రోత్సహిస్తాను….. -మన లక్ష్యం ఒక్కటే… రాహుల్...

-పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడి పని చేసేవారినే ప్రోత్సహిస్తాను….. -మన లక్ష్యం ఒక్కటే… రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలి…. -ఎన్నికలు ఏవైనా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండానే ఎగరాలి….. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

0
4

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21     స్టేషన్ ఘనపూర్

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా నేను ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టుతో ఎం అవుతుంది అని పిండ ప్రదానం చేసిన ఆ ప్రాజెక్టే నేడు వేలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తూ పాడిపంటలు పండిస్తోందని ఒక రాజకీయ నాయకునికి ఇంతకన్నా సంతృప్తి ఇచ్చే విషయం ఇంకేం ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం మరియు మండల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షులకు కండువాలు కప్పి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.అంతకుముందు స్టేషన్ ఘనపూర్ మండలంని వివిధ గ్రామాలకు సంబందించిన 24మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 14లక్షల 28వేల 500రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి  పంపిణి చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…. ఏ రాజకీయ పార్టీకైనా గ్రామ స్థాయి నాయకులతో సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు. పార్టీకి నాయకత్వం బలంగా ఉంటే అధికారంలోకి వస్తాం పార్టీ అధికారంలో ఉంటే మనం బలంగా ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం కల్పించిందని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న, రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న, రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పార్టీ పటిష్టం చేసుకోలని పేర్కొన్నారు. కొత్త పాత అనే ఆలోచనలు రావద్దని అందరం సమిష్టిగా పని చేయడంతో పాటు మనతో కలిసివచ్చే వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు. మన లక్ష్యం ఒక్కటేనని రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీ కార్యకర్త నిబద్దతతో పని చేయాలని అన్నారు. పార్టీలోనే ఉంటూ స్వంత పార్టీకి, స్వంత నాయకులకు వ్యతిరేకంగా పని చేస్తే మాత్రం సాహించేది లేదని హెచ్చరించారు. ఎవరైనా పార్టీ నిబంధనలకు, క్రమశిక్షణకు కట్టుబడి పని చేయాల్సిందేనని వెల్లడించారు.బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్యపు ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. బిఆర్ఎస్ అధికారాన్ని, ధరణిని అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రైతులను అడ్డుపెట్టుకొని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రం లో నదులలో, జలషయాలలో నీళ్లు లేవని తెలిసిన అబద్దపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్నారని అన్నారు. వానాకాలం పంటలను కాపాడే బాధ్యత మాదని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు తో ఎం కాదని దానికి కొంత మంది పిండ ప్రదానం కూడా చేశారని అన్నారు. కానీ ఈ రోజు పిండ ప్రదానం చేసిన ప్రాజెక్టే వేలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తూ పాడి పంటలు పండిస్తుందని ఒక రాజకీయ నాయకునికి ఇంతకన్నా సంతృప్తి ఇచ్చే విషయం ఏముంటుందని పేర్కొన్నారు. నాకున్న ఏకైక లక్ష్యం, ఏకైక ఆలోచన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే నని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్దే వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.