-పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడి పని చేసేవారినే ప్రోత్సహిస్తాను….. -మన లక్ష్యం ఒక్కటే… రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలి…. -ఎన్నికలు ఏవైనా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండానే ఎగరాలి….. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 స్టేషన్ ఘనపూర్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా నేను ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టుతో ఎం అవుతుంది అని పిండ ప్రదానం చేసిన ఆ ప్రాజెక్టే నేడు వేలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తూ పాడిపంటలు పండిస్తోందని ఒక రాజకీయ నాయకునికి ఇంతకన్నా సంతృప్తి ఇచ్చే విషయం ఇంకేం ఉంటుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్...