Thursday, November 19, 2026
Home People –బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరము…. –ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలి...

–బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరము…. –ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలి –  అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి…

0
8

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా పత్రిక నవంబర్ 17

బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు వాచ్ చిల్డ్రన్ ఫోరం సంయుక్తంగా నిర్వహించారు, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల , భదిరుల ఆశ్రమంలోని పిల్లలకు ఉచిత వైద్య శిబిరము నిర్వహించి, ఉచిత మందులను అందించడం జరిగింది, పిల్లలకు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కంటెం లక్షీనారాయణ గారు వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సూచనలు సలహాలు అందజేసారు, చలికాలం లో పిల్లల పట్ల ఆరోగ్యపరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేసారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ… ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని, పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని , తల్లిదండ్రుల ఆదరణ కరువైన పిల్లలకు మనం మరింత ప్రేమ ఆప్యాయతలు అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని అన్నారు, అందరి పిల్లలలాగానే మానసిక దివ్యాంగుల పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు, మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని, వారి పట్ల జాలి చూపే కంటే ఆదరణ, చేయుతనందించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, డాక్టర్ కంటెం లక్షీనారాయణ గారు,రాసు సుధారెడ్డి, స్పందన సంస్థ నిర్వాహకులు సుచరిత, టీచర్స్ వసుధ, హరిత, పిల్లలు తదితరులు పాల్గొన్నారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.