పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా పత్రిక నవంబర్ 16
హన్మకొండ రెడ్డి కాలనీలోని ప్రోగ్రెస్ హైస్కూల్ లో చిల్డ్రన్స్ డే వేడుకలు పాఠశాల చైర్మన్ మల్లాడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రాండ్‌మాస్టర్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, పాఠశాల విద్యార్థిని కుమారి బోయిని యశికా, మానవ శరీరంలోని అన్ని భాగాల పేర్లను ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో ఏకధాటిగా ఉచ్ఛరించి తన అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శించినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి 2026 సంవత్సరానికి గ్రాండ్‌మాస్టర్ హోదాను పొందడం జరిగింది ఇది డాక్టర్ అనితా రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలిబాలలందరికీ సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పౌష్టికాహారం, రక్షణ కల్పించడంతో పాటు వారు ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. బాలల భవిష్యత్తుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రతి పిల్లలకి సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించేందుకు ప్రభుత్వ శాఖలు, పాఠశాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. బాలల అభివృద్ధి, సంక్షేమం, విద్యాభివృద్ధి, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు,ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు ఆవిష్కృత మవుతాయన్నారు, చిన్నారి యశికా విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు, అనంతరం పిల్లలకు నిర్వహించిన ఆటల, పాటలు, డాన్స్ పోటీలలో గెలుపొందిన బాలలకు బహుమతులు అందజేశారు,పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి ఈ కార్యక్రమంలో డా. కె. అనితా రెడ్డి , పాఠశాల చైర్మన్ మల్లాడి ప్రభాకర్ రెడ్డి, బోయినపల్లి మహేష్ రావు ,రఘ తల్లిదండ్రులు, టీచర్స్, సిబ్బంది పాల్గొన్నారు.




