Friday, November 20, 2026
Home Uncategorized –పిల్లలకు హక్కులతో పాటు బాద్యతలు తెలియాలి – అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి.....

–పిల్లలకు హక్కులతో పాటు బాద్యతలు తెలియాలి – అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి.. —బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కార్యక్రమం..

0
13

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ జిల్లా పత్రిక నవంబర్ 18

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా హన్మకొండ బాలసముద్రం లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఆనంద నిలయం పిల్లలకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కల్పించారు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ… బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి పిల్లలకు రక్షణ, భద్రత, ప్రతి బిడ్డకు విద్య అందించడమే మన లక్ష్యం అని ప్రతి ఒక్కరూ చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండి అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించే క్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయం తో కలిసి పని చేద్దాం అన్నారు, పిల్లలకు వారి హక్కులతో పాటు బాద్యతలు తెలియచేయాలని అన్నారు బాలలే దేశ సంపద, భవిష్యత్తు పౌరులని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, తమ పరిసర ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం కొంత మంది బాలలు మాదకద్రవ్యా లకు అలవాటు పడటం ఆందోళనకరమైన విషయమని, వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని తెలిపారు, ప్రభుత్వం పిల్లల విద్య కు ఎంతో కర్చు చేస్తుందని పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలని, విద్య ద్వారా ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించి జీవితంలో ఎదగాలని పిలుపు నిచ్చారు, అనంతరం పిల్లలందరికీ డాక్టర్ అనితా రెడ్డి చలికాలం అవడంటతో రగ్గులను ఉచితంగా అందించారు ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి తోపాటు హాస్టల్ నిర్వహకులు సరిత, రాఘవ, పిల్లలు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.