Friday, November 20, 2026
Home Uncategorized చల్లసముద్రం గ్రామ పంచాయతీ లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’పై కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

చల్లసముద్రం గ్రామ పంచాయతీ లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’పై కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

0
18

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామ పంచాయతీ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు (పాంప్లెట్లు) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని వివరించారు. కుటుంబ పెద్దకు అనుకోకుండా మరణం సంభవించినా, ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఈ బీమా పథకం రక్షణ కవచంలా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు దొంతు వెంకటేశ్వర్లు గారు, ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తాటి బిక్షం గారు, వార్డ్ మెంబర్ నరాటి కోటేశ్వరరావు గారు, మాస బత్తిని వెంకటరమణ గారు, గండ్రకోట సీతారాములు గారు, కోరిపల్లి యశ్వంత్ గారు, మహంకాళి పవన్ గారు, పెరుమళ్ళ సమ్మయ్య గారు,పబ్బు శివ గారు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.