చల్లసముద్రం గ్రామ పంచాయతీ లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’పై కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామ పంచాయతీ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు (పాంప్లెట్లు) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని...