Tuesday, September 22, 2026
Home People -చైనాలో జరిగే ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హనుమకొండ క్రీడాకారిణి సాయి వర్షిణికి*...

-చైనాలో జరిగే ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హనుమకొండ క్రీడాకారిణి సాయి వర్షిణికి* -ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించి, అండగా నిలిచిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…

0
1

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21

హనుమకొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన యంగ్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి, కుమారి వెల్పుల సాయి వర్షిణి (తండ్రి: అనిల్) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభాపాటవాలు చాటేందుకు అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారు. చైనాలోని వుక్సీ నగరంలో వచ్చే నెల అక్టోబర్ 12 నుండి 18 వరకు జరగబోయే ప్రతిష్టాత్మక “5వ అండర్-15 ఉమెన్స్ సాఫ్ట్‌బాల్ ఆసియా కప్ 2026” పోటీలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా క్రీడాకారిణి, హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. సాయి వర్షిణి ప్రతిభను, దేశానికి ఆమె తెచ్చే కీర్తిని గుర్తించిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తన సొంత “ఇనగాల చారిటబుల్ ట్రస్ట్” తరపున సాయి వర్షిణికి తక్షణ సహాయంగా రూ. 10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ*.. మన హనుమకొండ జిల్లా మట్టిలో పుట్టిన ఆడబిడ్డ అంతర్జాతీయ స్థాయిలో దేశం తరపున, జాతీయ జెండా పట్టుకుని ఆడబోతుండటం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క క్రీడాకారుడి ప్రతిభ ఆగిపోకూడదనే ఉద్దేశంతో మా ట్రస్ట్ తరపున ఈ చిన్న సహాయాన్ని అందించాం. సాయి వర్షిణి చైనాలో జరిగే ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించి, దేశానికి బంగారు పతకం తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, అని తెలిపారు. అలాగే జిల్లాలోని ఇతర దాతలు, క్రీడాభిమానులు కూడా ముందుకు వచ్చి ఈ యంగ్ అథ్లెట్‌ను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.