Friday, September 11, 2026
Home Politics మార్సిజం అజయమైనది బిజెపి పాలనలో ప్రశ్నించే ప్రతి గొంతుక అర్బన్ నక్సలైట్.

మార్సిజం అజయమైనది బిజెపి పాలనలో ప్రశ్నించే ప్రతి గొంతుక అర్బన్ నక్సలైట్.

0
48
WhatsApp-Image-2026-04-22-at-10.43.36-AM-1

📰 Generate e-Paper Clip

మార్సిజం అజయమైనది

బిజెపి పాలనలో ప్రశ్నించే ప్రతి గొంతుక అర్బన్ నక్సలైట్.

పరివర్తన అవాజ్ న్యూస్ ఏప్రిల్ 22:(టేకులపల్లి) 
.
సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లిలో కాచి నపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జెండాను ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భూక్యా హర్జ ఎగుర వేయడం జరిగింది. అనంతరం. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి .ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనిజం అజయమైనదని పేద ప్రజలు ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని దీనిని నిర్మూలించడం కోసం పాలకులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని అయినా తారతమ్యాలు లేని సమాజం ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని కనుక పాలకులు, కమ్యూ నిజాన్ని నిర్మూలించాలంటే ముందుగా పేదలు లేని దేశంగా మార్చాలని అందరూ సమానత్వం తో జీవించినప్పుడే అది సా ధ్యమవుతుందని అన్నారు
తారతమ్యాలు ఉన్నంతవరకు కమ్యూనిజం వర్ధిల్లుతుందని అది అజయమైనదని అన్నారు. ఆకలి ఉన్నంతవరకు పేదలు ఉన్నంతవరకు కమ్యూనిజం ఉండి తీరుతుందని అన్నారు పాలకులు ప్రశ్నించే ప్రతి వాడిని అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు దేశ పౌర సమాజం నిరసనగలం ఇవ్వాలని అన్నారు.
పేద ప్రజల కోసం ఉద్యమించి అశులు బాసిన కాచినపల్లి అమరవీరులకు విప్లవోద్యమంలో అమరులైన అమరవీరులందరికీ విప్లవ జోహార్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు ఏ ఐ కె యం ఎస్ జిల్లా నాయకులు భూక్య హర్జ ఎట్టి నరసింహారావు గుగులోత్ రామచందర్ బానోత్ వెంకట్రాం ధరావత్ పాండ్యా కొడెం రవి తోటకూరి సతీష్ బోడ మంచా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.