Author: Sai Krishna

ఎంపీపీ ఎస్ తుమ్మలచిలక పాఠశాలలో ఘనంగా వీడ్కోలు, తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం పరివర్తన అవాజ్ న్యూస్ ఏప్రిల్ 22 టేకులపల్లి : టేకులపల్లి మండలంలోని ఎంపీపీ ఎస్ తుమ్మలచిలక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బి. ఫుల్ సింగ్ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం మరియు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్దూతండా సర్పంచ్ బానోత్ నరేష్, ఉపసర్పంచ్ భూక్య కాంతారావు, టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, మాజీ సర్పంచ్ నాగయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాలుగో తరగతి విద్యార్థులు గురుకుల ప్రవేశాల్లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా అభినందనలు తెలియజేయగా, ఐదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. భారీ సంఖ్యలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు, ఉపాధ్యాయులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Read More

గుత్తికోయ గూడెల్లో మలేరియా గుర్తింపు సర్వే పరివర్తన అవాజ్ న్యూస్ టేకులపల్లి 22 : టేకులపల్లి మండలంలోని మోట్లగూడెం, సిద్ధారం, నాగారపు జోగు గుత్తికోయ గూడెల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు వైద్య బృందం మలేరియా లక్షణాల గుర్తింపు సర్వే నిర్వహించింది. రక్త నమూనాలు సేకరించి త్వరిత పరీక్షల ద్వారా మలేరియా నిర్ధారణ చేపట్టడంతో పాటు ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. దోమతెరల వినియోగం, పరిసరాల పరిశుభ్రతపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

మార్సిజం అజయమైనది బిజెపి పాలనలో ప్రశ్నించే ప్రతి గొంతుక అర్బన్ నక్సలైట్. పరివర్తన అవాజ్ న్యూస్ ఏప్రిల్ 22:(టేకులపల్లి) .సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లిలో కాచి నపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జెండాను ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భూక్యా హర్జ ఎగుర వేయడం జరిగింది. అనంతరం. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి .ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనిజం అజయమైనదని పేద ప్రజలు ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని దీనిని నిర్మూలించడం కోసం పాలకులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని అయినా తారతమ్యాలు లేని సమాజం ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని కనుక పాలకులు, కమ్యూ నిజాన్ని నిర్మూలించాలంటే ముందుగా పేదలు లేని…

Read More

పరివర్తన అవజ్ న్యూస్ ఏప్రిల్ 11  (టేకులపల్లి ): టేకులపల్లి మండల కేంద్రంలో Jyotirao Phule 199వ జయంతిని ఏపీఎంకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంతెన ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, రచయిత మరియు విప్లవాత్మక నాయకుడని పేర్కొన్నారు. ఆయన తన సహచరురాలు Savitribai Phuleతో కలిసి స్త్రీల విద్య, దళిత వర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన కోసం నిరంతరం పోరాటం చేశారని తెలిపారు. 1873లో సత్యశోధక సమాజ్‌ను స్థాపించి కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేశారని, వితంతువు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించారని చెప్పారు. సమాజంలో సమానత్వం తీసుకురావడానికి తన ఇంటి బావిలో అందరికీ నీటిని అందించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు…

Read More

పరివర్తన అవాజ్ న్యూస్ మార్చి 22:   తెలంగాణ : రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్వాడీ వివరాలను అప్డేట్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పాతబడిపోవడంతో.. కొత్త ఫోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రోజుల్లోనే సీఎం రేవంత్ ఆ ఫోన్లను అందజేయనున్నట్లు సమాచారం. కొత్తగా 4G ర్యామ్, 64GB మెమొరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను ఇవ్వనున్నారు. అంగన్వాడీ టీచర్ ప్రతిరోజు ఫోన్‌లో పోషణ్ ట్రాకర్ యాప్‌లో 14 రకాల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.​

Read More

పరివర్తన అవాజ్ న్యూస్ : మార్చి 23వ తేదీ, సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Read More

  పరివర్తన అవాజ్ న్యూస్ :టేకులపల్లి,మార్చి21 మండల పరిధిలోని టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీల ఉమ్మడి వారపు సంత నిర్వహణ కోసం ఈనెల 23వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్‌లు బోడ బాలు నాయక్,లకావత్ నాకా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఒక సంవత్సరం కాలపరిమితికి గాను నిర్వహించే ఈ వేలం పాట గత సంవత్సరం టేకులపల్లి గ్రామపంచాయతీ లో జరగగా ఈ సారి సోమవారం ఉదయం 10 గంటలకు గోల్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతుందని వారు పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం వేదిక మార్పు ఉంటుంది.వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వేలం దారులు ₹50,000/-(యాభై వేల రూపాయలు)ముందస్తు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వేలం నిర్వహించబడుతుందని,వేలం దారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Read More

టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు మరియు ఆసక్తి గల వేలం దారులకు తెలియజేయునది ఏమనగా:

మన గ్రామ పంచాయతీకి సంబంధించిన సంత వేలంపాట నిర్వహించబడుతుంది. ఈ వేలంపాటలో పాల్గొనదలచిన వారు క్రింది వివరాలను గమనించగలరు:

📅 వేలం తేదీ: 23/03/2026
📍 వేలం స్థలం: గోల్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయం
⏰ వేలం సమయం: ఉదయం 10:00 గంటలకు
💰 ముందస్తు డిపాజిట్: ₹50,000/- (యాభై వేల రూపాయలు)
📆 కాలపరిమితి: ఒక సంవత్సరం (1 సంవత్సరం)

📌 నిబంధన:
వేలంలో పాల్గొనదలచిన వారు తప్పనిసరిగా పై పేర్కొన్న డిపాజిట్ మొత్తాన్ని నిబంధనల ప్రకారం ముందుగా జమ చేయాలి.

కావున ఆసక్తి గలవారు నిర్ణీత సమయంలోగా డిపాజిట్ చెల్లించి, వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరడమైనది.బోడ బాలు నాయక్
(సర్పంచ్, టేకులపల్లి)

లకావత్ నాకా నాయక్
(సర్పంచ్, గోల్యతండా)

ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

అక్షరమే ఆయుధంగా..ఆశయమే ఊపిరిగా:ఉత్తమ అధ్యాపకుడు ‘బాణోత్ జుంకీలాల్’  ఖమ్మం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ న్యూస్ జనవరి 27   ఖమ్మం గడ్డపై మెరిసిన అక్షర శిఖరం: నిరుపేద గిరిజన గూడెం నుంచి వచ్చి, నేడు వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అక్షర యోధుడు శ్రీ బాణోత్ జుంకీలాల్.సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల తెలుగు అధ్యాపకుడిగా ఆయన చేస్తున్న సేవలు నేడు జిల్లా గర్వించే స్థాయికి చేరాయి.77వ గణతంత్ర దినోత్సవ వేళ,ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఆయన అందుకున్న “జిల్లా ఉత్తమ అధ్యాపక అవార్డు” ఆయన కష్టానికి దక్కిన అసలైన గౌరవం. జుంకీలాల్ గారి ప్రస్థానం సామాన్యమైనది కాదు. ఆకలి తెలిసిన పేదరికం నుంచి వచ్చినా, అక్షరంపై ఉన్న మమకారం ఆయన్ని కుంగదీయనివ్వలేదు. “తాను పడ్డ కష్టం తన విద్యార్థులు పడకూడదు” అనే సంకల్పంతో, ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దుతున్నారు.…

Read More

  వ్యవసాయ కార్మిక సంఘం  నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్. కొత్తగూడెం: 2026జనవరి 23, శుక్రవారం: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ఆవిష్కరించారు, శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలిచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు, వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, బిజెపి ప్రభుత్వం స్విస్ బ్యాంకులో ఉన్న నల్లదనం తెచ్చి పేదలను లక్షాదికారులను చేస్తానని అనేక మాయ మాటలు చెప్పి మోసం చేసిందన్నారు, దేశంలో పేదలకు ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు,  మహాత్మా…

Read More