ఎంపీపీ ఎస్ తుమ్మలచిలక పాఠశాలలో ఘనంగా వీడ్కోలు, తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం
పరివర్తన అవాజ్ న్యూస్ ఏప్రిల్ 22 టేకులపల్లి :
టేకులపల్లి మండలంలోని ఎంపీపీ ఎస్ తుమ్మలచిలక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బి. ఫుల్ సింగ్ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం మరియు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్దూతండా సర్పంచ్ బానోత్ నరేష్, ఉపసర్పంచ్ భూక్య కాంతారావు, టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, మాజీ సర్పంచ్ నాగయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నాలుగో తరగతి విద్యార్థులు గురుకుల ప్రవేశాల్లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా అభినందనలు తెలియజేయగా, ఐదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. భారీ సంఖ్యలో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు, ఉపాధ్యాయులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
