Saturday, September 12, 2026
Home Politics 15వ డివిజన్ లో గెలుపొందిన కార్పొరేటర్ ఆకునూరీ సుప్రియ ను సన్మానించిన దుర్గారాశి సతీష్, ఆడెపు...

15వ డివిజన్ లో గెలుపొందిన కార్పొరేటర్ ఆకునూరీ సుప్రియ ను సన్మానించిన దుర్గారాశి సతీష్, ఆడెపు ప్రదీప్ కుమార్

0
43
IMG-20260213-WA0279

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్‌గా  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకునూరి సుప్రియ గెలుపొందిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన భారత యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుర్గరాశి సతీష్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఆడేపు ప్రదీప్ కుమార్ కలిసి ఆకునూరి సుప్రియను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 15వ డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆకునూరి సుప్రియను గెలిపించడం అభివృద్ధికి నాంది అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.