15వ డివిజన్ లో గెలుపొందిన కార్పొరేటర్ ఆకునూరీ సుప్రియ ను సన్మానించిన దుర్గారాశి సతీష్, ఆడెపు ప్రదీప్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకునూరి సుప్రియ గెలుపొందిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన భారత యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుర్గరాశి సతీష్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఆడేపు ప్రదీప్ కుమార్ కలిసి ఆకునూరి సుప్రియను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 15వ డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆకునూరి...