Saturday, September 12, 2026
Home Politics మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సమావేశం –

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సమావేశం –

0
48
IMG-20260207-WA0016

📰 Generate e-Paper Clip

 

ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని నేతల హామీ

పరివర్తన అవాజ్,కొత్తగూడెం టౌన్ :-మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా మరియు రాష్ట్ర నాయకుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. వార్డు వార్డుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తమ పార్టీ కార్పొరేటర్లు ఎన్నికైతే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

జిల్లాలోని పలు డివిజన్ ల ను సందర్శించిన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా నాయకులు, కె.వి. రంగా కిరణ్, మండల స్థాయి నాయకులు గొడుగు శ్రీధర్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.