మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సమావేశం –
ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని నేతల హామీ పరివర్తన అవాజ్,కొత్తగూడెం టౌన్ :-మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా మరియు రాష్ట్ర నాయకుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. వార్డు వార్డుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు...