Saturday, September 12, 2026
Home Crime చుంచుపల్లి మెయిన్ రోడ్డుపై బూడిద లారీలు భయానకంగా… ప్రమాదాల ముప్పు

చుంచుపల్లి మెయిన్ రోడ్డుపై బూడిద లారీలు భయానకంగా… ప్రమాదాల ముప్పు

0
46
IMG_20260226_122713

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి బైపాస్,మెయిన్ రోడ్  రోడ్డుపై నెంబర్ ప్లేట్లు లేకుండా భారీ వాహనాలు బూడిదను విడుదల చేసుకుంటూ ప్రమాదకర రీతిలో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. లారీలలో సరైన కవర్లు లేకుండా బూడిదను తరలించడం వల్ల గాలిలో బూడిద జల్లుకుంటూ వెనుక వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

కొన్ని లారీలు అతివేగంగా నడుస్తూ, లోడును సరిగా కట్టకుండా తీసుకెళ్లడం వల్ల ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించే వారు భయాందోళనకు గురవుతున్నారు. బూడిద కళ్లలో పడటం, రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల కొన్ని సందర్భాల్లో లారీలు రహదారిపై బూడిద చల్లడంతో వెనుక వస్తున్న వాహనాలు స్కిడ్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని వాహనదారులు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారులు వెంటనే స్పందించి —

  • బూడిద రవాణా చేసే లారీలకు తప్పనిసరిగా కవర్లు వేయించడం,
  • నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై జరిమానాలు విధించడం,
  • బైపాస్ రోడ్డుపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం,
  • అతివేగం నియంత్రణ చర్యలు చేపట్టడం

వంటి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వినతి చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.