పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ దుకాణం వ్యవహారానికి సంబంధించి సిద్ధిరాములు అనే వ్యక్తి నుంచి ఎస్సై ఆంజనేయులు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తంలో భాగంగా రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్సైను పట్టుకున్నట్లు సమాచారం. కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని ఎస్సై నివాసంలో డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం ఎస్సై నివాసంలో పలు ఫైళ్లు, సంబంధిత పత్రాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. లంచం డిమాండ్, ఇప్పటికే తీసుకున్న మొత్తంతో పాటు తాజా ట్రాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు, తదుపరి చట్టపరమైన చర్యలపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




