రూ.30 వేల లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై ఏసీబీకి పట్టుబాటు

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్‌ కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్‌ దుకాణం వ్యవహారానికి సంబంధించి సిద్ధిరాములు అనే వ్యక్తి నుంచి ఎస్సై ఆంజనేయులు రూ.50 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తంలో భాగంగా రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్సైను పట్టుకున్నట్లు సమాచారం....