చుంచుపల్లి మెయిన్ రోడ్డుపై బూడిద లారీలు భయానకంగా… ప్రమాదాల ముప్పు

పరివర్తన అవాజ్ కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి బైపాస్,మెయిన్ రోడ్  రోడ్డుపై నెంబర్ ప్లేట్లు లేకుండా భారీ వాహనాలు బూడిదను విడుదల చేసుకుంటూ ప్రమాదకర రీతిలో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. లారీలలో సరైన కవర్లు లేకుండా బూడిదను తరలించడం వల్ల గాలిలో బూడిద జల్లుకుంటూ వెనుక వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని లారీలు అతివేగంగా నడుస్తూ, లోడును సరిగా కట్టకుండా తీసుకెళ్లడం వల్ల ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో ద్విచక్ర వాహనదారులు, కార్లలో ప్రయాణించే వారు భయాందోళనకు గురవుతున్నారు....