Saturday, September 12, 2026
Home Politics కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అందుకున్న 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆకునూరి సుప్రియ

కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అందుకున్న 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆకునూరి సుప్రియ

0
47
IMG_20260203_134248

📰 Generate e-Paper Clip

బీఫామ్ అందజేసిన డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆకునూరి సుప్రియ బీఫామ్ అందుకుని ఎన్నికల బరిలోకి దిగారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సేవ చేయాలని సంకల్పంతో ముందుకు వస్తున్నానని ఆమె తెలిపారు.

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం:-రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 15వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ఆకునూరి సుప్రియ అధికారికంగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వార్డులో ప్రధానంగా మంచినీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, అవసరమైన సర్టిఫికెట్ల జారీ, కమ్యూనిటీ హాళ్ల సౌకర్యాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి సేవను వేగంగా అందించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

తాను కార్పొరేటర్‌గా ఎన్నికైతే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని సుప్రియ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

తమపై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని 15వ వార్డు ప్రజలను ఆకునూరి సుప్రియ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ప్రధాన ధ్యేయమని ఆమె అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.