Monday, September 14, 2026
Home Politics ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే బరిలో…

ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే బరిలో…

0
21
IMG-20260125-WA0428

📰 Generate e-Paper Clip


– 29వ డివిజన్ లో పోటీ చేస్తున్న చదలవాడ సూరి
– ప్రజలనుంచి విశేష జనాదరణ…

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

నా డివిజన్లోని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని… గత పాలకులు చేసిందేమి లేదని, మీకు న్యాయం చేయాలనీ, మీకు అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ సూరి విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని ఉన్న 29వ డివిజన్ ప్రతి ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడతారు. అందులో గతంలో పోటీ చేసినటువంటి మాజీ కౌన్సిలర్స్ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి 29వ డివిజన్ ప్రజలు… గతంలో మాజీ కౌన్సిలర్స్ జనాలని ఎంత పీడించుకొని తిన్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే… కొత్త మీటర్ పెట్టాలంటే 20,000 రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే ఇంటి నెంబర్ కావాలంటే 50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు వసూళ్లు చేశారు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా 2000 నుంచి 5000 వరకు వసూళ్లు చేశారని ఆరోపించారు. ఎక్కడా కూడా గత వార్డు ప్రజలకు ఇప్పుడు డివిజన్ అయింది కాబట్టి డివిజన్ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఎక్కడ న్యాయం జరిగినట్టు బాగుపడటం లేదు 29వ డివిజన్ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వస్తున్న ప్రజా ప్రతినిధులు ఎవరు అయితే మనకి న్యాయం చేస్తారు అని అనుకునే వారికే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి ప్రజలందరికీ ఓటు అనే ఆయుధం అందించారు. దానిని మనం ఆలోచన చేసి మనకి ఎవరైతే న్యాయం చేస్తారో అని చూసుకొని ఎవరైతే డబ్బులు అడగకుండా మనకు పని చేస్తారని ఆ ఒక్క ఓటుని సరైన వ్యక్తికి వేయాలని 29వ డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటూ మరొక్కసారి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.