Saturday, September 12, 2026
Home People ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.. అఖిలపక్ష పార్టీల డిమాండ్

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.. అఖిలపక్ష పార్టీల డిమాండ్

0
15

📰 Generate e-Paper Clip

     ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి..అఖిలపక్ష పార్టీల డిమాండ్

టేకులపల్లి పరివర్తన అవాజ్  నవంబర్21,  బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తో కొనసాగిస్తున్న నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో టేకులపల్లి సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మావోయిస్టు నాయకులను సానుభూతిపరులను ప్రజలను పెద్ద ఎత్తున బూటకపు ఎకౌంటర్లో హత్య చేస్తున్నారని ఈ హత్యాకాండము నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టేకులపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్. ఏ ఐ కె యం ఎస్ జిల్లా నాయకులు భూక్యా హర్జా ..సి పి ఐ నాయకులు ఐతా శ్రీరాములు మాస్ లైన్ డివిజన్ నాయకులు జర్పులా సుందర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ మాట్లడుతూ దేశంలో కొనసాగుతున్న ఆకలి చావులను పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా దేశంలో ప్రశ్నించే అవకాశం లేకుండా చేయవచ్చు అని అలా కాకుండా దేశంలో రోజురోజుకు పెరుగుతున్న అవినీతి. పేదరికం దారిద్రం ఆకలి సావులను నివారించకుండా ప్రశ్నించే వారిని ఎదురు కాలుతుల పేరుతో పట్టుకొని కాల్చి చంపుతున్నారని ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని మావోయిస్టు నాయకుల నిర్మూలన ధ్యేయంగా బిజెపి ప్రభుత్వం పోలీస్ బలగాలను మోహరించి మావోయిస్టులపై యుద్ధం చేస్తూ అంతం చేస్తున్నాయని లొంగుబాటు కోసం వచ్చిన నాయకులను కూడా పట్టుకొని కాల్చి చంపుతున్నారనే ప్రచారం జరుగుతుందని అదేవిధంగా పోలీసు అదుపులో మావోయిస్టు ముఖ్య నాయకులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుందని నిజంగా పోలీసుల అదుపులో మావోయిస్టులు ఉంటే వారి ప్రాణానికి హాని తలపెట్టకుండా కోర్టులో అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, భూక్య నర్సింగ్ మాజీ సర్పంచ్ భూక్య కీరియా బానోతు వెంకట్రావు గూగులోతు రామచంద్ బోడ మంచా ఆంగోత్ బాలు పివైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ నాయకులు భూక్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.