Saturday, September 12, 2026
Home People శేరిలింగంపల్లి లో అసంపూర్తిగా పనులు, కొనసాగిస్తున్నారు

శేరిలింగంపల్లి లో అసంపూర్తిగా పనులు, కొనసాగిస్తున్నారు

0
14

📰 Generate e-Paper Clip

         శేరిలింగంపల్లి లో అసంపూర్తిగా పనులు, కొనసాగిస్తున్నారు

                      నత్తనడకన మంజీరా పైప్ లైన్ పనులు

                     నిరుపయోగంగా మరీనా కూరగాయల మార్కెట్‌

                        శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణుల నిరసన

శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 21 శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న మంజీర పైప్‌లైన్ రోడ్డు పనులు, కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినా నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్ వ్యవహారంపై బీజేపీ నాయకులు శుక్రవారం నాడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ కంటస్టెడ్ ఎమ్మెల్యే శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, మంజీర రోడ్డు పనుల ఆలస్యం వల్ల ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే పనులు త్వరతగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.నిరుపయోగంగా మారిన కూరగాయల మార్కెట్:కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కూరగాయల మార్కెట్ షెడ్లు నిరుపయోగంగా మారాయని, వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించడం తో కూరగాయల షెడ్లలో అసాంఘిక కార్యకలాపాలకు కొనసాగుతున్నాయని రవికుమార్ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు.స్థానిక సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించిన రవికుమార్ యాదవ్, రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి, మార్కెట్‌ను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.