Friday, September 11, 2026
Home Uncategorized ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత

ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత

0
14

📰 Generate e-Paper Clip

ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత   సద్వినియోగం చేసుకోవాలని ఏజీఎం సత్యనారాయణ పిలుపు

పరివర్తన అవాజ్ న్యూస్ ముకుందాపురం14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం,కట్టుగూడెం గ్రామానికి చెందిన ఎస్బిఐ వినియోగదారుని కుటుంబానికి ఎస్బీఐ బ్యాంక్ అండగా నిలబడింది. కేవలం రూ. 1000/- చెల్లించి తీసుకున్న పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ కింద, మృతుని నామినీకి రూ. 20 లక్షల చెక్కును అందజేశారు.వివరాల్లోకి వెళితే, కట్టుగూడెం గ్రామానికి చెందిన పరిటాల పుల్లయ్య  మూడు నెలల క్రితం పిడుగు పాటుకు గురై మరణించారు. ఆయన ఎస్బీఐ బ్యాంకులో రూ. 1000/-తో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించుకోగా, భార్య పరిటాల లలితను నామినీగా నమోదు చేశారు. పుల్లయ్య మరణానంతరం, నామినీ లలిత ముకుందాపురం ఎస్బీఐ మేనేజర్ శివశంకర్ ని సంప్రదించారు. బ్యాంక్ సిబ్బంది వేగంగా స్పందించి, ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం పంపగా, నామినీకి రూ. 20,00,000/- చెక్కు మంజూరైంది.
ముకుందాపురం ఎస్బీఐ శాఖలో జరిగిన కార్యక్రమంలో, భద్రాద్రి కొత్తగూడెం ఏజీఎం (అసిస్టెంట్ జనరల్ మేనేజర్) సత్యనారాయణ  చేతుల మీదుగా నామినీ పరిటాల లలితకు బీమా కవరేజ్ మొత్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఏజీఎం సత్యనారాయణ  మాట్లాడుతూ. 18 నుంచి 65 సంవత్సరాల వయసు వారికి మాత్రమే వర్తించే ఈ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం కేవలం ఎస్బీఐ బ్యాంక్ నందు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శివశంకర్ మాట్లాడుతూ… ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ కలిగి ఉండటం కుటుంబానికి ఆర్ధిక భరోసాగా ఉంటుందని, ఈ కవరేజ్ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ , బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.