Friday, September 11, 2026
Home Uncategorized కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ

కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ

0
15

📰 Generate e-Paper Clip

కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14 ; శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్ చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన మంజూరైన 186 మంది లబ్ధిదారులకు ఒక కోటి ఎనభై ఆరు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కుల రూపేణా అందచేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్బంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 20 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని పిఎసి చైర్మన్ గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని పిఎసి చైర్మన్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, నాయకులు , కార్యకర్తలు, మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.