చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జేమ్స్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
కొత్తగూడెం, అక్టోబర్ 26 (పరివర్తన ఆవాజ్)
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జేమ్స్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధన్బాద్ గ్రౌండ్లో మహా అన్నదాన కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే పెద్దబాబు, నాగేంద్ర త్రివేది, ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, అచ్చ నాగరాజు, జె. రాజేశ్వరరావు, కీర్తి కుమార్, బానోత్ బిచ్చ, గాంధీ కనకరాజు, కిషన్, రుద్రంపూర్, గౌతంపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రక్తదానం చేసిన యువకులుజన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బైపల్లి శంకర్, హైట్ శివ, ఓర్సు ఐలు, పల్లపు ఈశ్వర్, శశి, కొంకటి వేణు, సుమంత్, శివతో పాటు మరో పది మంది రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు యువకులు ముందుకు రావడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజాసేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, రక్తదాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.




