Thursday, October 29, 2026
Home Politics –నరకుడు రవీందర్ దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

–నరకుడు రవీందర్ దశదిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

0
8

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28

పర్వతగిరి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నరకుడు రవీందర్ ఇటీవల మరణించగా, వడ్లకొండలోని వారి నివాసానికి దశదిన కార్యక్రమానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రవీందర్ మృతి పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సావిత్రి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, ఎల్డియం కోఆర్డినేటర్ కొందూరు వెంకటరెడ్డి, చౌటపల్లి సొసైటీ చైర్మన్ కుమార్ స్వామి, వర్ధన్నపేట మండల అధ్యక్షులు పోశాల వెంకన్న, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, మాజీ ఇల్లంద మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, పర్వతగిరి మండల మహిళా అధ్యక్షురాలు సువార్త, మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు మన్నే బాబురావు, వడ్లకొండ గ్రామశాఖ అధ్యక్షులు డెక్క అనిల్,జిల్లా,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.