Monday, October 26, 2026
Home Politics –రోడ్డు ప్రమాదంలో గాయపడిన సతీష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే KR నాగరాజు …

–రోడ్డు ప్రమాదంలో గాయపడిన సతీష్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే KR నాగరాజు …

0
7

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26

గ్రేటర్ వరంగల్ రెండవ డివిజన్ వంగపహడ్ గ్రామానికి చెందిన కుమ్మరి సతీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  సోమిడిలోని ఆయన స్వగృహానికి వెళ్లి సతీష్‌ను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు.తన వంతుగా సతీష్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి, మాజీ డివిజన్ అధ్యక్షులు పొన్నాల రఘు, సీనియర్ నాయకులు దోమ కుమార్, పొన్నాల కిరణ్, కందికొండ రవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.