Monday, October 26, 2026
Home People శబరిమల అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర ప్రారంభం

శబరిమల అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర ప్రారంభం

0
15

📰 Generate e-Paper Clip

40 మంది స్వాములతో 45 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్ర

పరివర్తన ఆవాజ్  నిజామాబాద్ : అయ్యప్ప స్వామి భక్తి శ్రద్ధలతో శబరిమల క్షేత్రానికి 40 మంది అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సుమారు 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని, స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులు అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భక్తి, నియమ నిష్ఠలు, ఆధ్యాత్మిక చింతనతో సాగనున్న ఈ పాదయాత్రలో స్వాములందరూ సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గుండయ్య గురుస్వామి, ఆగమయ్య గురుస్వామి, ప్రధాన అర్చకులు రమేష్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.