Tuesday, October 27, 2026
Home People —బాణాసంచా విక్రయాలకు తాత్కాలిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోండి.. – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్....

—బాణాసంచా విక్రయాలకు తాత్కాలిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోండి.. – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

0
24

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26

రానున్న దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు కోరే వారు, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను నవంబర్ 2వ తేదీలోపు సంబంధిత డీసీపీ కార్యాలయంలో సమర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ తెలిపారు.దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ జారీ చేసిన ఎన్‌ఓసీ, స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి అనుమతి పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, గతంలో లైసెన్స్ ఉంటే దాని ప్రతితో పాటు, అవసరమైన చోట్ల పక్క స్థల యజమానుల అనుమతి పత్రాలు, సైట్ ప్లాన్ బ్లూప్రింట్ సమర్పించాలి.అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆధాలత్ శాఖలో ప్రభుత్వ ఖజానాకు రూ.800 చెల్లించిన బ్యాంక్ చలాన్‌ను జతచేయాలి.దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సంబంధిత డీసీపీ స్థాయి అధికారులు నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.