పేద కుటుంబానికి అండగా సీఎం సహాయ నిధి
పరివర్తన ఆవాజ్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన మంగలి శకుంతలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అందజేశారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేదలకు ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందడం ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ప్రశాంత్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు గాయత్రి, శ్యామ్, మహేశ్వరి, విద్యాసాగర్, మహమ్మద్ ఉన్నిస్, రఫిక్, దుంపల మంజుల, శంకర్, అటుకారి చంద్రన్న, సయ్యద్ గఫర్, భాగ్యవతి, సిద్ధి శ్రీధర్, తిరుపతి, శివానంద్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. కో-ఆప్షన్ సభ్యులు వసీం, వహీద్, పప్పు వెంకటి, అరుణ తదితరులు హాజరయ్యారు.




