Tuesday, October 27, 2026
Home People ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం

0
9

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా లో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోద పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి  పట్ల గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం మానుకోవాలని, ప్రధానమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజల్లో ఉన్న మోదీ  ఆదరణను తగ్గించలేరని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని జిల్లా బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.