—బాణాసంచా విక్రయాలకు తాత్కాలిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోండి.. – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26 రానున్న దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు కోరే వారు, అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను నవంబర్ 2వ తేదీలోపు సంబంధిత డీసీపీ కార్యాలయంలో సమర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ తెలిపారు.దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ జారీ చేసిన ఎన్‌ఓసీ, స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి అనుమతి పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, గతంలో లైసెన్స్ ఉంటే దాని ప్రతితో పాటు,...