Thursday, October 29, 2026
Home People –పిన్నింటి అనిల్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

–పిన్నింటి అనిల్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

0
5

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28
ఇటీవల అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు ఇంటికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు ఆయనను పర్వతగిరిలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనిల్ రావు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మునుపటిలా ఉత్సాహంగా ఉండాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సావిత్రి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, ఎల్డియం కోఆర్డినేటర్ కొందూరు వెంకటరెడ్డి, చౌటపల్లి సొసైటీ చైర్మన్ కుమారస్వామి,వర్ధన్నపేట మండల అధ్యక్షులు పోశాల వెంకన్న,వర్ధన్నపేట సొసైటీ చైర్మెన్ అబ్బిడి రాజిరెడ్డి,మాజీ ఇల్లంద మార్కెట్ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, పర్వతగిరి మండల మహిళ అధ్యక్షురాలు సువార్త,మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నే బాబురావు,వడ్లకొండ గ్రామ శాఖ అధ్యక్షులు డెక్క అనిల్, జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.