Thursday, October 29, 2026
Home People –పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు…జడ్జి మధుళిక, డాక్టర్ అనితా రెడ్డి…

–పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు…జడ్జి మధుళిక, డాక్టర్ అనితా రెడ్డి…

0
10

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో బుధవారం హంటర్ రోడ్డు దగ్గర శాయంపేట ప్రాంతం లోని మైనారిటీ బాలికల ఆశ్రమ పాఠశాల లో పోక్సో చట్టం -2012 పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షత వహించారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మధులిక తేజ, విశిష్ట అతిధిగా అనురాగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, పోష్ చట్టం ఎక్స్్టర్నల్ కమిటీ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి పాల్గొని పిల్లలకు పోక్సో చట్టం పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చట్టం (POCSO Act) అనేది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలురు మరియు బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడి మరియు అశ్లీలత వంటి నేరాల నుండి చిన్నారులకు రక్షణ కల్పించే ప్రత్యేక భారతీయ చట్టం అని,చట్టం పూర్తి పేరు: లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offences Act, 2012) అన్నారు పిల్లలు అంటే నిర్వచనం: 18 సంవత్సరాల వయస్సు నిండని ప్రతి ఒక్కరూ (అమ్మాయి లేదా అబ్బాయి) ఈ చట్టం ప్రకారం ‘పిల్లవాడు’ కిందే వస్తారు, వీరిని ఇబ్బంది పెడితే కఠినమైన శిక్షలు పడతాయని అన్నారు, పిల్లలు అపరిచితు లతో స్నేహం చేయవద్దని,ప్రేమ పేరు తో మోస పోవద్దని తెలిపారు, టీచర్స్ చదువు తోపాటు పిల్లలకు మంచి నడవడిక, చట్టాలపై, గుడ్ టచ్ బాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని అన్నారు, పిల్లలు ఏ సమస్య వచ్చినా 112 లేదా 1098 నెంబర్లకు ఫోన్ చేయాలని, తల్లిదండ్రుల తో ప్రతి విషయం పంచుకోవాలని, తల్లిదండృలు పిల్లలకు సమయం కేటాయించాలని, పిల్లల రోజు వారి కార్యక్రమాలపై నిఘా ఉండాలని జడ్జి మధుళిక, డాక్టర్ అనితా రెడ్డి అన్నారు అనంతరం పిల్లలచే అపరిచితులతో సావాసం చేయం, ప్రేమ ఉచ్చు లో పడం , ఎవరైనా ఇబ్బంది పెడితే ధైర్యంగా ఎదుర్కొంటామనిప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో జడ్జి మధుళిక, డాక్టర్ అనితా రెడ్డి, కేయు. ఎస్. ఐ శ్రావణి,, లీగల్ కౌన్సిలర్ రవి ప్రిన్సిపాల్ నీరజ, టీచర్స్ పిల్లలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.