Monday, October 26, 2026
Home Politics —ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

—ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీలు శంకర్ నాయక్,బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి,మహమ్మద్ ఆయుబ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్  తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణ, ఎన్నికల సన్నద్ధత, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, పార్టీ నిర్ణయాలు మరియు కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,చైర్మన్లు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,మహిళ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.