పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25
పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన చౌటపల్లి పీఏసీఎస్ డైరెక్టర్ గరికపాటి రామారావు సతీమణి సుజాత హనుమకొండలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా సుజాత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకొని, త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గరికపాటి రామారావు కి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి వెంట చౌటపల్లి సొసైటీ చైర్మెన్ అత్తి కుమారస్వామి, డైరెక్టర్ దేవేందర్, వడ్లకొండ గ్రామశాఖ అధ్యక్షులు డెక్క అనిల్ కుమార్, సోమారం గ్రామశాఖ అధ్యక్షులు చౌదం సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.




