పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 5
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌కు చెందిన రిటైర్డ్ జెడ్పీ సూపరింటెండెంట్ సౌరం వెంకన్న(సామ్యూల్) మృతి చెందిన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజా సేవలో సుదీర్ఘకాలం పనిచేసిన వారి సేవలను ఎమ్మెల్యే నాగరాజు స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




