Thursday, October 22, 2026
Home Politics సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి… *ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం –...

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి… *ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం – ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

0
26

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ఇండియా కూటమి పార్టీల సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ… ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 5వ తేదీన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా హనుమకొండ అంబేద్కర్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు ఇండియా కూటమి భాగస్వామ్య భక్షాల ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు, తీర్మానాలు నిర్వహించి ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ గళాన్ని బలంగా వినిపిస్తామని తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. బీజేపీ అంటేనే ఈడి, సీబీఐ ద్వారా నాయకులను భయబ్రతులను గురిచేసి దారుణమైన చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బిజెపికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు.ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్న అప్పారావు, టీజేఎస్ అధ్యక్షులు జిల్లా రాజేంద్రప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి బిక్షపతి, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ దుద్దిల్ల శ్రీను బాబు, చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కూటమినేతల పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.