పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో గ్రామశాఖ అధ్యక్షుల పాత్ర కీలకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. పర్వతగిరి మండలంలోని 33 గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులను శనివారం ఎమ్మెల్యే హన్మకొండ సుబేదారిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామశాఖ అధ్యక్షులు పార్టీకి వెన్నెముకలాంటి వారని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని చెప్పారు. అనంతరం గ్రామశాఖ అధ్యక్షులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నాయకత్వంలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి, కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు,చౌటపల్లి PACS చైర్మెన్ అత్తి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోట్ల మహేందర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మెట్టపల్లి వెంకటేశ్వర రావు,సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, 33 గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




