గ్రామశాఖ అధ్యక్షులను సన్మానించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…. -పర్వతగిరి మండలంలోని 33 గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకు ఘన సన్మానం
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 3 కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో గ్రామశాఖ అధ్యక్షుల పాత్ర కీలకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. పర్వతగిరి మండలంలోని 33 గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులను శనివారం ఎమ్మెల్యే హన్మకొండ సుబేదారిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా...