Thursday, October 22, 2026
Home Politics –దసరా నాటికి అమ్మవారి రథం ప్రారంభం… –తుదిమెరుగులు దిద్దుతున్న కళాకారులు.. —మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించిన...

–దసరా నాటికి అమ్మవారి రథం ప్రారంభం… –తుదిమెరుగులు దిద్దుతున్న కళాకారులు.. —మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

0
40

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02

దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రకాళి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న మాడవీధులు, అమ్మవారి రథం పనులను పరిశీలించారు. దసరా ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అమ్మవారి రథానికి సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయని, కళాకారులు రథానికి తుదిమెరుగులు దిద్దుతున్నారని తెలిపారు. దసరా నాటికి రథాన్ని సిద్ధం చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.మాడవీధుల నిర్మాణం పూర్తయితే ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగడంతో పాటు ఉత్సవాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. భక్తుల సౌకర్యం, ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి, మిగిలి ఉన్న పనులు, దసరా ఉత్సవాల నాటికి పూర్తి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట KUDA అధికారులు అజిత్ రెడ్డి,భీమ్ రావు,ఆలయ ఈఓ సునీత,స్థానిక నాయకులు బోడ డిన్న,డివిజన్ అధ్యక్షులు సమద్,మాజీ అధ్యక్షులు సంగీత,గోల్కొండ సాంబయ్య,క్రాంతి కుమార్,శివ,రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.