–దసరా నాటికి అమ్మవారి రథం ప్రారంభం… –తుదిమెరుగులు దిద్దుతున్న కళాకారులు.. —మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రకాళి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న మాడవీధులు, అమ్మవారి రథం...