Thursday, October 22, 2026
Home Politics స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని  రాజేందర్ రెడ్డి…

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని  రాజేందర్ రెడ్డి…

0
8

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 

గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు వారికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వికాస్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీలలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో అనేక పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా, అర్హులైన కుటుంబాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో కూడా కీలకమని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం కలుగుతుందని తెలిపారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సుమారు 16 వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతోందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.