Thursday, October 22, 2026
Home Politics State -గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం… —వరంగల్ జిల్లా మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో...

-గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం… —వరంగల్ జిల్లా మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్…..

0
10

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17

హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో-ఇన్‌చార్జి శ్రీ సచిన్ సవత్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ జిల్లా మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్  పాల్గొన్నారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, మండలాలు, టౌన్‌లు, డివిజన్ల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకులు మరియు కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.పార్టీ అధిష్ఠానం ఆదేశాలు, రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు సంకల్పించారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పోశాల వెంకన్న, ఇస్లావత్ సావిత్రి, టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణకర్, మాడుగుల రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కమలుద్దీన్, యువజన నాయకుడు పత్రి భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.